Saturday, October 23, 2010

భారతీయులకు ఇక ఆహార భద్రత

న్యూఢిల్లీ,అక్టోబర్ 23:  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలోని కనీసం 75 శాతం జనాభాకు ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాలు అందించాలని జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 90% ప్రజలు, పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలు ఆ పరిధిలోకి రావాలని సూచించింది. దారిద్య్ర రేఖకు ఎగువ, దిగువ అన్న తేడాలను పక్కనపెట్టి రెండు ప్రత్యేక కేటగిరీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అందులో ఒకటి ‘ప్రాధాన్య’ విభాగం కాగా రెండోది ‘సాధారణ’ విభాగం. ఈ రెండు విభాగాలకు సబ్సిడీపై చట్టబద్ధంగా ఆహార ధాన్యాలు అందజేయాలని పేర్కొంది. శనివారమిక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి ఆరో సమావేశం జరిగింది. ఇందులోనే ఈ సిఫారసులను ఖరారు చేశారు. వీటిని త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో చర్చకు పెట్టి, పార్లమెంటులో ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎన్‌ఏసీ భేటీ అనంతరం మండలి సభ్యుడు నరేంద్ర జాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ,మార్చి 31, 2014 కల్లా దేశవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని, . చట్టం మొదటి దశ అమలుకు ఖజానాపై రూ. 15,137 కోట్ల భారం పడుతుందని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...