తెలంగాణ బిల్లు కోసం ఢిల్లీ వీధికెక్కిన ‘దేశం’
నూఢిల్లీ,అక్టోబర్ 25; ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట నినాదా లతో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలనే ముఖ్య డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నాయకులు ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం ఇవ్వాలనే ఉద్ద్యేశ్యంతో.. ఆమె నివాసం వైపు చొచ్చుకుపోవాలని చూసిన వీరిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి , కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతల నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక రైలులో ఉదయమే ఇక్కడకు చేరుకున్న వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఏపీ భవన్ నుండి జంతర్‌మంతర్ వరకు ర్యాలీగా వెళ్లారు.
Comments