రామలింగరాజు బెయిల్ రద్దు
న్యూఢిల్లీ,అక్టోబర్ 26: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆయనతో పాటు మరో అయిదుగురి బెయిల్'ని కూడా కోర్టు రద్దు చేసింది. నవంబర్ 8వ తేదీ లోపు వారు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. రామలింగరాజు సాక్షులను ప్రభావితం చేయవచ్చన్న సిబిఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. 2011 జూలై 31 నాటికి విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రిం కోర్టు నాంపల్లి కోర్టును ఆదేశించింది.
Comments