పరిటాల ఘాట్ ను సందర్శించిన వివేక్ ఒబెరాయ్
అనంతపురం ,అక్టోబర్ 25: రక్తచరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ సోమవారం అనంతపురం చేరుకున్నాడు. అభిమానులు భారీ కాన్వాయ్‌తో వివేక్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ అనంతపురం ప్రజలకు నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడాడు. పరిటాల రవి పాత్ర పోషించటం సంతృప్తి ఇచ్చిందన్నారు. రక్తచరిత్ర సినిమా ప్రేక్షకాదరణ పొందటం చాలా ఆనందంగా ఉందన్నాడు. వెంకటాపురం గ్రామంలో పరిటాల ఘాట్ ను వివేక్ ఒబెరాయ్ సందర్శించారు. రవి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
Comments