ట్యాంక్ బండ్ పై కొమరంభీం విగ్రహానికి ప్రభుత్వం ఒకే
హైదరాబాద్,అక్టోబర్ 28 : ట్యాంక్‌బండ్‌పై కొమరంభీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. గత కొద్ది రోజులుగా ట్యాంక్‌బండ్ విగ్రహాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొమరంభీమ్ విగ్రహాన్ని పెట్టకపోతే మిగతా విగ్రహాలను కూల్చివేస్తామని, తెలంగాణ ఊసె త్తని శ్రీశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం... నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని తెలంగాణవాదులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments