సౌదీ యువరాజుకు జీవితఖైదు
లండన్,అక్టోబర్ 20: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మనవడు సౌద్ అబ్దులజీజ్ బిన్ నజీర్ అల్‌సౌద్(34)కు బ్రిటన్
న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అల్‌సౌద్, ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లోని ల్యాండ్‌మార్క్ హోటల్‌లో, తన సేవకుడైన బందూర్ అజీజ్ (32)ను కొట్టి, గొంతు పిసికి చంపేశాడు. లండన్ ఓల్డ్ బెయిలీ కోర్టు జడ్జి అల్‌సౌద్‌కు 20 ఏళ్ల జీవిత ఖైదు విధించారు. రాజు అబ్దుల్లా కుమార్తె కుమారుడైన అల్‌సౌద్, దౌత్యాహోదా ఉన్న తనను విడిచిపెట్టాలని మొదట్లోనే విజ్ఞప్తి చేశాడు. అల్‌సౌద్‌కు ఈ హోదాలేదని బ్రిటన్ విదేశాంగ శాఖ తెలపడంతో పోలీసులు అతణ్ణి కోర్టుకు హాజరు పరిచారు. ‘వాలంటైన్ డే’నాడు రాత్రంతా పార్టీలలో గడిపి అల్‌సౌద్, అజీజ్‌తో కలిసి హోటల్‌కు తిరిగి వచ్చాడు. తాగిన మైకంలోనే హత్యకు పాల్పడ్డాడు. వారిద్దరి మధ్య ఉన్న స్వలింగ సంపర్క సంబంధాలు, లైంగిక హింస, చివరికి హత్యకు దారితీశాయని పోలీసులు నిర్ధారించారు. యువరాజు తాను హత్య చేయలేదని బుకాయించినా, సీసీ టీవీ టేపులు అతని నేరానికి సాక్ష్యంగా నిలిచాయి.
Comments