
లండన్,అక్టోబర్ 22: బ్రిటన్ పెద్దల సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి భారత సంతతికి చెందిన స్వరాజ్ పాల్ సహా ముగ్గురు సభ్యులు సస్పెండయ్యారు. మిగిలిన ఇద్దరూ కూడా ఆసియన్ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. స్వరాజ్ పాల్ పై నాలుగు నెలల సస్పెన్షన్ విధించగా, బారోనెస్ మాంజిలా పోలా ఉద్దీన్ పై పద్దెనిమిది నెలలు, అమీరాలీ అలీభాయ్ భాటియాపై ఎనిమిది నెలలు సస్పెన్షన్ విధిస్తూ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏకగ్రీవంగా తీర్మానం తీసుకుంది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై హౌస్ ఆఫ్ లార్డ్స్ హక్కుల కమిటీ వీరి సస్పెన్షన్ కు సిఫారసు చేసింది. ఈ సిఫారసును హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్వరాజ్ పాల్ అవినీతికి పాల్పడకపోయినా, నిధుల వినియోగంలో నిర్హేతుకంగా, బాధ్యతారహితంగా వ్యవహరించారని హక్కుల కమిటీ తన దర్యాప్తులో నిర్ధారించింది.
Comments