భారత బాలలకు అమెరికా సోయా చిరుతిళ్లు
వాషింగ్టన్,అక్తోబర్ 20: పోషకాహార లోపంతో బాధపడుతున్న భారతీయ బాలలకోసం నోరూరించే రకరకాల సోయా చిరుతిళ్లను అమెరికా శాస్తవ్రేత్తలు సిద్ధం చేస్తున్నారు. కారు చౌకకు శాఖాహార ప్రొటీన్లనుసమృద్ధిగా అందించే ఈ వంటకాలను స్కూలు పిల్లలు మహా ఇష్టంగా తినేలా భారతీయ రుచులలోనే తయారు చేస్తున్నారు. భారతీయులు ఎలాగూ చిరుతిళ్ల ప్రియులుకాబట్టి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ఆ రూపంలోనే దండిగా ప్రొటీన్లను చౌకగా అందించాలనే సదుద్దేశంతో ఇల్లినోయిస్ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు ఈ పరిశోధనా కార్యక్రమం చేపట్టారు. తొమ్మిది రకాల సోయా వంటకాలు అప్పుడే ల్యాబరేటరీ దాటేసి, పరీక్ష దశకు చేరుకున్నాయి. కరకరలాడుతున్నవీ ఉప్పఉప్పగా లేక ఘాటుఘాటుగా ఉన్నవీ, పులుపు జీలకర్ర రుచులతో ఘమాయిస్తున్నవీ, కారం కారంగా మసా లా ఘాటుతో జమాయిస్తున్నవీ మంచి మార్కులు కొట్టేస్తున్నాయట. కొన్ని వంటకాలకు మాత్రం జీరోలు పడుతున్నాయట. అమెరికాలో రుచుల పరీక్ష ముగిశాక, బెంగళూరులో తుది పరీక్ష జరుగుతుంది.
Comments