ఎన్నారైలకు ‘ఐ-ఎక్స్ ప్రెస్ ’
దుబాయ్,అక్టోబర్ 20: గల్ఫ్ లోని ప్రవాస భారతీయుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఐ-ఎక్స్ ప్రెస్ ’ పేరుతో నూతన సేవలు ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నారైలు సులభంగా స్వదేశానికి డబ్బులు పంపొచ్చు. గల్ఫ్ దేశాల్లో ఎంపిక చేసిన భాగస్వాముల ద్వారా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ‘ఐ-ఎక్స్ ప్రెస్ ’ ద్వారా ఎన్నారైలు స్వదేశంలోని తమ ఖతాల్లోకి నగదు బదిలీ చేసుకోవచ్చని, లబ్దిదారులు వెంటనే డబ్బు తీసుకోవచ్చని పేర్కొంది. భారత దేశంలో ఉన్న తమ శాఖలు, ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే లబ్దిదారులు తమ బ్యాంక్‌లో ఖాతా కలిగివుండాలన్నారు. ఇండియన్ రిమిటెన్స్ మార్కెట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఈ సేవలు అందిస్తోంది.
Comments