అమెరికాలో కరీంనగర్ యువకుని మృతి

డాలస్,అక్టోబర్ 19: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాచర్ల రాజేంద్రప్రసాద్(28) అనే తెలుగు యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. టెక్సాస్ రాష్ర్టలోని ఆస్టిన్ నగరంలో అక్టోబర్ 17న అతడు మరణించాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో త్రి అతడిని సెయింట్ డేవిడ్ నార్త్ ఆస్టిన్ ఆస్పత్రికి తరలించారు. మెదడు నాళాలు వాచాయని వైద్యులు గుర్తించారు. కోమాలోని వెళ్లిపోయిన రాజేంద్రప్రసాద్ బెయిన్‌డెడ్ అయ్యాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడు. ట్రవీస్ కౌంటీ మెడికల్ సెంటర్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ వస్తే గానీ అతడికి మృతి గల కారణాలు స్పష్టంగా తెలియవు.కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. మూడున్నరేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆస్టిన్‌లోని చార్లెస్ షకవాబ్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే అతడికి వివాహమయింది. అతడి భార్య ర జని (25) మూడు నెలల క్రితమే ఇక్కడకి వచ్చింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు