Wednesday, October 27, 2010

ముంబై, ఢిల్లీ కి మాత్రమే ఒబామా పర్యటన పరిమితం

వాషింగ్టన్,అక్టోబర్ 27:  అసాధరణ భద్రతా యేర్పాట్ల మధ్య అమెరికా అద్యక్షుడు బరక్ ఒబామా  తొలిసారిగా భారత పర్యటన జరపనున్నారు.  ఆయన వెంట భారీ వ్యాపార ప్రతినిధివర్గం ఈ పర్యటనలో పాల్గొంటోంది. నవంబర్ 6,7, తేదీలలో  ముంబై తాజ్ మహల్ హోటల్ లో బస చేయనున్న ఒబామా  ముంబైతో పాటు ఢిల్లీ మాత్రమే సందర్శిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.  నవంబర్ ఆరవ  తేదీ తెల్లవారుఝామున ముంబై చేరుకోనున్న ఒబామా 26/11 వుగ్రవాద  దాడి  మ్రుతుల స్మారక   కార్యక్రమంలో  పాల్గొనడం తో పాటు రెండు దేశాల సి.ఇ.ఓ.ల సమావేశంలో పాల్గొంటారు.ధిల్లీ పర్యటన లొ ఒబామా భారత పార్లమెంట్ లో 20 నిమిషాల సేపు ప్రసంగిస్తారు. పార్లమెంట్‌ భవనంలో ఒబామా గంట సమయాన్ని కేటాయిస్తారు. దేశ వ్యవహారాల గురించి చర్చలు జరుపుతారు. భార్య మిషెల్‌ ఒబామాతో కలసి పార్లమెంట్‌ భవనాన్ని సందర్శిస్తారు. అనంతరం పార్లమెంట్‌లో ఉన్న బంగారు పుస్తకంలో ( గోల్డెన్‌ బుక్‌) సంతకం చేస్తారు. ఒబామా ప్రసంగించే వేదికపై భారత ఉప రాష్టప్రతి హామీద్‌ అన్సారీ స్వాగతోపన్యాసం ఇస్తారు. లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ అభినందనలు తెలుపుతారు. ఒబామా పక్కనే భారత ప్రధాని మన్మోహన్‌ ఉంటారు.  కాగా, విదేశాంగ మంత్రి హిల్లరీక్లింటన్ ఈ పర్యటనలో పాల్గొనడం లేదు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...