Saturday, October 30, 2010

ఆడిటోరియం నిర్మాణం యోచనకు సుబ్బిరామిరెడ్డి స్వస్తి

న్యూఢిల్లీ,అక్టోబర్ 30: హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం వద్ద ఆధునిక ఆడిటోరియం కట్టించి ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలన్న యోచనను మార్చుకున్నానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. లలిత కళాతోరణాన్ని అలాగే ఉంచాలని సమాజంలోని వివిధ వర్గాలవారి నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తెలుగు లలిత కళాతోరణానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టాలని తాను కోరానంటూ పెద్ద ఎత్తున వివాదం రేగిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. నగరంలో మరోచోట ఎక్కడైనా సరే స్థలం ఇస్తే ఆడిటోరియం కట్టి ఇవ్వటానికి తాను సిద్ధమేనని చెప్పానని తెలిపారు. ఆడిటోరియం పేరు గురించి చాలా మంది అపార్థం చేసుకున్నారని, అసలు వివాదం పేరు మార్పు గురించి కాదని, ఓపెన్ ఆడిటోరియాన్ని అలాగే ఉంచాలన్నదే అందరి అభిమతమని వ్యాఖ్యానించారు. ‘లలితకళా తోరణానికి రాజీవ్ పేరు పెట్టటాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా.. మరి పేరు లేకుండా ఆడిటోరియం కట్టించి ఇవ్వటానికి అంగీకరిస్తారా?’ అని అడిగిన ప్రశ్నలకు నేను నా పేరు పెట్టమనలేదు. నాకిష్టమైన నాయకుడు రాజీవ్ పేరు పెట్టాలని కోరాను. అది తప్పెలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...