Saturday, October 23, 2010

భారతీయునికి అమెరికా ‘వైతాళిక’ పురస్కారం

వాషింగ్టన్,akToebar 23; ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో లోపాల్ని ప్రదర్శించి జైలుపాలైన భారతీయ పరిశోధకుడిని అమెరికా అవార్డు  వరించింది.  శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పౌర స్వేచ్ఛా సంస్థ ‘ఎలక్ట్రానిక్ ఫ్రంటైర్ ఫౌండేషన్’, ఈవీఎం మిషిన్ల భద్రతపై పరిశోధన చేసిన భారతీయుడు హరికృష్ణ ప్రసాద్‌కు 2010 సంవత్సరానికి గానూ పయనీర్ అవార్డును ప్రకటించింది. అంటే తెలుగులో ‘వైతాళికుడు’ అని అర్థం. కాగితపు రహిత ఈవీఎం మిషిన్ల వాడకంలో నిక్షిప్తమయ్యే ఓటుకు రక్షణ లేదని హరిప్రసాద్ పరిశోధించి నిరూపించారు. దీన్ని ప్రజల ముందు కూడా ప్రదర్శించారు. అయితే ఇందుకోసం కలెక్టరేట్‌లో ఈవీఎం మిషిన్‌ను తస్కరించారనే అభియోగంపై ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన హరిప్రసాద్ ఈ అవార్డు ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో వివాదంతో ముడిపడిన తన పరిశోధన అమెరికా సంస్థను మెప్పించడం విశేషమేనన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇంతుకుముందు వరల్డ్‌వైడ్‌వెబ్ (డబ్యుడబ్యుడబ్యు) రూపకర్త టిమ్ బెర్నర్స్-లి, భద్రతా నిపుణుడు బ్రూస్ షినర్, మోజిల్లా సెర్చింజిన్, దాని చైర్మన్ మిచెల్ బేకర్ తదితర ప్రముఖులు అందుకున్నారు. సాంకేతిక రంగంలో విశిష్ట పరిశోధనలు నిర్వహంచిన వారికి 1992 నుంచి ఏటా ఈ అవార్డులను అందజేస్తున్నారు. తాజాగా హరిప్రసాద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబర్ 8న జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకుంటారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...