Monday, October 18, 2010

హైదరాబాద్ కు మన్మోహన్

హైదరాబాద్,అక్టోబర్ 19: ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరోజు పర్యటనకై మంగళవారం హైదరాబాద్ వచ్చారు. హెచ్‌ఐసీసీ (హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో అకాడమీ ఆఫ్ సెన్సైస్ ఫర్ ద డెవలపింగ్ వరల్డ్ (టీడబ్ల్యూఎఎస్) వార్షిక సమావేశంలో పాల్గొంనారు. ఈ నెల 22 వరకు జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 350మంది శాస్తవ్రేత్తలు హాజరు పల్గొంటున్నారు. ప్రధాని ప్రసంగిస్తూ సాంస్కృతిక భిన్నత్వం కలిగిన హైదరాబాద్ ఆధునీక భారతదేశానికి ప్రతీక అని ప్రశంసించారు.ఆధునిక వ్యవసాయ పద్ధతులు చేపట్టకపోవటం కూడా వర్ధమాన దేశాల అభివృద్ధికి ఆటంకంగా మారిందని ప్రధాని అన్నారు. వర్థమాన దేశాలు ఈ సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కొంటే విజయం సాధించగలమన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సాధించివలసింది ఇంకా ఎంతో ఉందని మన్మోహన్ పేర్కొన్నారు.మారుతున్న కాలంలో ఒక్కరో, ఒక్కదేశమో అన్ని పరిశోధనలు చేయలేదన్నారు. అందరం కలిసి నడిస్తేనే త్వరితగతిన అభివృద్ధి చెందుతామన్నారు. శాస్త్ర పరిశోధనల్లో యువత కొత్త దారులు వెతకాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే అభివృద్ధి పర్యావరణానికి చేటు కాకుడదన్నారు. అనంతరం గచ్చిబౌలిలోని సెంట్రల్ యుూనివర్సిటీలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) కేంద్రానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్ళారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...