31 స్థానాలు పడిపోయిన సానియా ర్యాంకింగ్
న్యూఢిల్లీఅక్టోబర్ 19: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్ లో ఏకంగా 31 స్థానాలు పడిపోయింది. గతవారం 136వ స్థానంలో నిలిచిన ఈ హైదరాబాదీ తాజా ర్యాంకింగ్స్ లో 167వ ర్యాంక్‌కు దిగజారింది. డబుల్స్‌లో 65 నుంచి 67వ స్థానానికి చేరుకుంది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్ లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఒక స్థానం పడిపోయి 96వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్ 377వ ర్యాంక్‌లో ఉన్నాడు. సోమ్‌దేవ్ తర్వాత భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్ విష్ణుదే కావడం గమనార్హం. పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ పేస్ మూడు స్థానాలు ఎగబాకాడు. ఆదివారం ముగిసిన షాంఘై మాస్టర్స్ టోర్నీలో మెల్జర్‌తో కలిసి టైటిల్ నెగ్గిన పేస్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి చేరాడు.
Comments