కరాచీలో మరోసారి హింస; 12 మంది మృతి
కరాచీ, అక్టోబర్ 20: పాకిస్థాన్‌లోని కరాచీలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. మంగళవారం రాత్రి ఇక్కడి ర ద్దీ మార్కెట్‌లోకి మోటారుసైకిళ్లపై వచ్చిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గత ఐదు రోజుల్లో జరిగిన వివిధ హింసాత్మక సంఘటనల్లో చనిపోయినవారి సంఖ్య 55కి చేరింది. ఎంక్యూంకి చెందిన చట్టసభ సభ్యుడు రజా హైదర్ హత్యతో కరాచీలో ఘర్షణలు చెలరేగాయి.
Comments