ముంబై తాజ్‌లో బస చేయనున్న ఒబామా: గది అద్దె రోజుకు రు.10లక్షలు
ముంబై, అక్టోబర్ 26: త్వరలో భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస కోసం ముంబైలోని తాజ్‌మహల్ హోటల్‌లోని ప్రీమియర్ ప్రెసిడెన్షియల్ సూట్‌ను సిద్ధం చేశారు. ఆ గది అద్దె ఒక రోజుకు అక్షరాలా రూ.పది లక్షలు. ఒబామా నవంబర్ 6, 7 తేదీల్లో ఈ హోటల్లో బస చేయనున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా హోటల్ పైభాగంలోని హెలిప్యాడ్ వద్ద దిగి హోటల్ గదికి చేరుకుంటారు. ఆయనతోపాటు వచ్చే భద్రతాధికారులు, ఇతర సిబ్బంది కోసం ఇప్పటికే 560 గదులను బుక్ చేశారు. అలాగే తాజ్ ప్రెసిడెంట్‌లో 120 గదులు, ఒబెరాయ్ హోటల్‌లోని 90 గదులు కూడా అమెరికా అధికారుల పేరిట బుక్ఉ. అయ్యాయి. మరోవైపు తాజ్‌మహల్ పరిసరాల్లో బందోబస్తుకు స్వయంగా రంగంలోకి దిగిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు హోటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో చిన్న అలికిడి జరిగినా కనిపెట్టే రాడార్లను ఏర్పాటు చేశారు. ఒబామాకు 24 మంది అంగరక్షకులు సిద్ధం గా వున్నారు.
Comments