చికాగో ఇన్‌స్టిట్యూట్‌లో గణేశ్ పాఠాలు
నెవాడా (అమెరికా), సెప్టెంబర్ 26: ప్రపంచంలోనే ప్రముఖ కళా పీఠం 'ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ చికాగో' హిందూ దేవుడు గణేశుని తమ పాఠ్యాంశంగా చేర్చింది. కిం డర్‌గార్డెన్ నుంచి 12వ తరగతి వరకూ వివిధ స్థాయిలలో గణేషుని చిత్ర వి చిత్ర కళారూపాలపై విద్యార్థులకు బో ధించనున్నారు. గణేషుని ఆకృతులు, వివిధ ముద్రలు, నాట్య భంగిమలతో పాటు శివ, పార్వతి, ఏనుగు రూపం, భారతీయ సంస్కృతిపై పాఠాలుంటాయి. ఇందుకోసం హిందూ కళాకృతులను సమకూర్చుకుని, గణేషుని ఘన చరిత్రను కూడా ఈ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ వారు సిద్ధం చేసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్ర ముఖ హిందూ మేధావి రాజన్ జెడ్ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ హిందూ ధర్మంలో కళకు ఎల్లవేళలా పెద్దపీట ఉందని, సంస్కృత సాహిత్యంలో దేవతల చిత్రీకరణపై ప్రస్తావన ఉందని తెలిపారు.
Comments