బాలకృష్ణ రాముడుగా,నయనతార సీతగా బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం
హైదరాబాద్,సెప్టెంబర్ 29: సంపూర్ణరామాయణం, శ్రీరామాంజనేయయుద్ధం, సీతాకళ్యాణం వంటి అద్భుత పౌరాణిక చిత్రరాజాలను ప్రేక్షకులకు అందించిన మిత్ర ద్వయం- బాపు, రమణ మరో పౌరాణిక యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘శ్రీరామరాజ్యం’ ఈ చిత్రం పేరు. బాలకృష్ణ ‘రాముడు’గా, నయనతార ‘సీత’గా ఇందులో నటిస్తారు. ఈ పౌరాణిక చిత్రానికి యలమంచిలి సాయిబాబు నిర్మాత. ఈ చిత్రానికి రచన, స్క్రీన్‌ప్లే ముళ్లపూడి వెంకటరమణ సమకూరుస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి ఆర్ట్: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్‌కణ్ణన్, ఎడిటింగ్: జి.జి.కృష్ణారావు, కెమెరా: పి.ఆర్.కె.రాజు, కో-ఆర్డినేటర్: సి.ద్వారకానాథ్‌బాబు, అసోసియేట్ డెరైక్టర్: శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవకృష్ణ.

Comments