ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి
మెల్‌బోర్న్,సెప్టెంబర్ 28 : ఆస్ట్రేలియాలో భారతీయుడిపై మళ్లీ జాత్యహంకార దాడి జరిగింది. "ఒరేయ్.. నువ్వు భారతీయుడివా?'' అని అడిగి మరీ బేస్‌బాల్ బ్యాట్లతో దారుణంగా కొట్టిన వైనమిది. శాన్‌డౌన్ పార్కు రైల్వేస్టేషన్‌కు నడిచి వెళ్తున్న 21 ఏళ్ల భారతీయుడిని నలుగురు కుర్రాళ్లు బైకుల మీద వచ్చి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడికి మోకాళ్లు పగిలిపోవడంతో పాటు ముక్కు మీద పెద్ద గాయమైంది. దాడి చేసినవారంతా 15-16 ఏళ్ల మధ్యవారేనన్న పోలీసులు.. బాధితుడి పేరు మాత్రం వెల్లడించలేదు. పలు సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న తూర్పు శివార్లలో ఇలాంటి సంఘటన జరగడం ఆశ్చర్యకరమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా (ఎఫ్ఐఏవీ) అధ్యక్షుడు వాసన్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు.
Comments