78వ ఏట అడుగిడిన మన్మోహన్
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 27: ప్రధాని మన్మోహన్ సింగ్ 78వ ఏట అడుగుపెట్టారు. ఆదివారం ఆయన నిరాడంబరంగా తన జన్మదినం జరుపుకొన్నారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రధానికి పుష్ప గుచ్ఛాలు పంపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, విపక్ష నేత సుష్మా స్వరాజ్ తదితరులు మన్మోహన్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments