బంగ్లా పై భారత్ గెలుపు
చిటగాంగ్,జనవరి 21: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 113 పరుగుల తేదా తో గెలిచింది. 415 పరుగుల విజయలక్ష్యానికి గాను బంగ్లా జట్టు 301 పరుగులకు ఆలౌట్ అయింది. 67/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు గురువారం ఆట ప్రారంభించిన బంగ్లా మరో 234 పరుగులు చేసిన ఆలౌటయింది. బంగ్లా జట్టులో రహీమ్ 101, ఇక్బాల్ 52 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, అమిత్ మిశ్రా 3, జహీర్‌ఖాన్ 2, సెహ్వాగ్ 1, వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాఢించిన గంభీర్ కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆథిక్యత సంపాదించింది
Comments