నాగ్ కు చైతన్యోత్సాహం
హైదరాబాద్,మార్చ్ 1: గీతాంజలి సినిమా కలిగించిన చక్కటి అనుభూతిని ‘ఏ మాయ చేసావె’ చిత్రం కూడా కలిగించిందని ప్రముఖ కథానాయకుడు నాగార్జున పేర్కొన్నారు. తన తనయుడు నాగచైతన్య నటించిన ఈ ద్వితీయ చిత్రాన్ని చూసిన ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ, ఈ చిత్రంలో యాక్షన్‌కు ప్రాధాన్యం ఉండదని, చక్కటి ప్రేమకథాచిత్రమిదని, ఆ ఫీల్ తోనే ఈ చిత్రాన్ని చూడాలని ప్రేక్షకాభిమానులను కోరారు. తన తనయుడు చిత్రమన్న ఉద్దేశంతో తాను మాట్లాడటం లేదని, అన్నివిధాలుగా చిత్రం బాగుందని, వేరొకరు ఈ చిత్రంలో నటించివున్నా తాను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తానని ఆయన స్పష్టంచేశారు. గతంలో తాను నటించిన ‘గీతాంజలి’ చిత్రంపైన మొదట్లో విమర్శలు వచ్చాయని, హీరో క్యాన్సర్ రోగి కావడం, గడ్డం పెంచుకుని ఉండటం, ఫైట్లు లేకపోవడం వంటివాటిని అభిమానులు వ్యతిరేకించారని, అయితే సినిమా విడుదలైన వారం తర్వాత ఆ చిత్రం కలెక్షన్లతో పుంజుకుని ఎంతటి చక్కటి దృశ్యకావ్యంగా ప్రేక్షకాభిమానులను ఎంతగా అలరింపజేసిందో తెలిసిందేనని ఆయన అన్నారు. ‘ఏ మాయ చేసావె’లో ఆ తరహా క్యాన్సర్, గడ్డం వంటి అంశాలు లేవని, అయితే చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు అద్భుతమైన ఫీల్‌ను కలిగిస్తుందని ఆయన చెప్పా...