Tuesday, November 9, 2010

బుకీల బెదిరింపులతో క్రికెట్ కు గుడ్ బై: హైదర్

కరాచీ,నవంబర్ 9: బుకీల బెదిరింపులకు భయపడి జట్టు నుంచి అదృశ్యమైన పాకిస్థాన్ వికెట్ కీపర్ జుల్ఖర్‌నైన్ హైదర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న 24 ఏళ్ల హైదర్..రిటైర్మెంట్ నిర్ణయం గురించి పీసీబీకి లేఖ పంపనున్నట్టు  చెప్పాడు.  దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేను ఫిక్స్ చేయాల్సిందిగా తనకు బెదిరింపులు వచ్చాయని చెబుతూ సోమవారం హైదర్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు  నాలుగు వన్డేలు ఆడి 48 పరుగులు చేయగా.. ఒక్క టెస్టు ఆడి 88 పరుగులు సాధించాడు. మూడు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 23 పరుగులు చేశాడు. ‘కొందరి నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడి కారణంగా కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబానికి ఇప్పటికి కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఈ టెన్షన్‌ను భరించలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం’ అని లండన్ నుంచి హైదర్ ఒక వార్తా చానెల్ కు చెప్పాడు.  ‘నాలుగు, ఐదో వన్డే ఫిక్స్ చేస్తే  భారీ మొత్తంలో డబ్బు ముడుతుందని,  ఒకవేళ నిరాకరిస్తే మాత్రం జట్టులో ఉండకపోవడమే కాక అనేక సమస్యలు ఎదుర్కొంటావని అని ఒక  వ్యక్తి బెదిరించినట్టు హైదర్ వివరించాడు. లండన్‌లో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఈ వికెట్ కీపర్ నిరాకరించాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...