Friday, November 12, 2010

రాజీనామా ప్రసక్తే లేదన్న కేంద్ర మంత్రి రాజా

న్యూఢిల్లీ,నవంబర్ 12: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని టెలికాం మంత్రి ఎ.రాజా స్పష్టం చేశారు.అంతా చట్టం ప్రకారమే జరిగినట్టు నిరూపిస్తానని రాజా చెప్పారు. కేటాయింపుల అంశం కోర్టులో ఉన్నందున తాను దానిపై మాట్లాడబోనని చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తామన్న జయ ప్రకటనపై స్పందిస్తూ ‘అలాంటి ప్రకటనలు చేసే నైతిక హక్కు ఆమెకు లేదు. అవినీతి కేసులో తనని తాను రక్షించుకునేందుకు కోర్టులో సొంత సంతకాన్నే గుర్తించలేని ఏకైక సీఎం జయలలితే’ అని ఆరోపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తన పార్టీ నేత అయిన రాజాను వెనకేసుకొచ్చారు. ఈ వివాదంలో రాజా ‘దోషి’ కాదని, ఆయన ఏ తప్పూ చేయలేదని చెప్పారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలోని టెలికాం మంత్రులు ప్రమోద్ మహాజన్, అరుణ్ శౌరిలు ప్రవేశపెట్టిన విధానాలనే రాజా కూడా పాటించారు. అందులో తప్పేముంది?’ అని కరుణానిధి పేర్కొన్నారు. యూపీఏ సర్కారుకు డీఎంకే మద్దతు ఉపసంహరిస్తే, తాము మద్దతిస్తామంటూ అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ప్రకటించడాన్ని కరుణ ప్రస్తావిస్తూ ‘జయ ఆఫర్ ఇచ్చినా.. ఖాళీలు లేవంటూ కాంగ్రెస్ ఆమెకు తలుపులు మూసేసింది’ అని కరుణానిధి వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...