Tuesday, November 9, 2010

ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్ పేలి ఉవ్వెత్తున మంటలు

హైదరాబాద్,నవంబర్ 9: తూర్పుగోదావరి జిల్లా పొన్నమండ-తాటిపాక మధ్య గెయిల్ గ్యాస్ పైపులైన్ భారీ విస్ఫోటనంతో పేలిపోయింది. సుమారు 50 మీటర్ల ఎత్తుతో మంటలు ఎగసిపడటంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (గెయిల్)కు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) ఉంది. ఇక్కడి నుంచి మామిడికుదురు మండలం నగరంలోని తాటిపాక జీఎస్‌సీకి గ్యాస్‌ను పైపులైన్ ద్వారా సరఫరా చేస్తుంటారు.పొన్నమండ గ్యాస్ కలెక్షన్ స్టేషన్, కేశనపల్లి గ్రూపు గేదరింగ్ స్టేషన్‌ల నుంచి పైపులైన్ ద్వారా రోజుకు సుమారు ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా అవుతుంటుంది. ఈ క్రమంలో పొన్నమండ పైపులైన్‌కు సహజవాయువు పీడనం ఎక్కువకావడంతో హఠాత్తుగా భారీ శబ్ధంతో పైపులైన్ పగిలిపోయింది. దీంతో గతంలో పాశర్లపూడి మాదిరి బ్లో అవుట్ సంభవించిందనే భయంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీచేసేందుకు స్థానికులు సన్నద్ధ మయ్యారు. మంటలు ఒకేసారి ఎగసిపడటంతో కొబ్బరిచెట్లు, వరిపొలాలు మాడిమసైపోయాయి. మంటలవేడి సుమారు 500 మీటర్ల వరకు వ్యాపించింది. సుమారు 20 కిలోమీటర్ల వరకు మంటలు కన్పించడంతో పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా భయభ్రాంతులై స్థానికులకు ఫోన్‌లు చేసి సమాచారం తెలుసుకున్నారు. విషయం తెలుసుకుని రాజోలు అగ్నిమాపక శాఖ, ఓఎన్‌జీసీ అగ్నిమాపక వాహనాలను హుటాహుటిన తరలించి చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరిచే చర్యలు తీసుకున్నారు. తాటిపాక గెయిల్ ప్రధాన కేంద్రం వద్ద గ్యాస్ సరఫరా వాల్వు, పొన్నమండ జీసీఎస్ వద్ద ఉన్న వాల్వు నిలిపివేయడంతో, పైపులైన్‌లో ఉన్నంతవరకు గ్యాస్ మండిపోయి గంటన్నరసేపు ఎగసిపడ్డ మంటలు వాటంతట అవే ఆగిపోయాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...