Monday, November 8, 2010

మరోమారు బద్దలైన మౌంట్ బులుసాన్ అగ్నిపర్వతం

మనీలా,నవంబర్ 8: తూర్పు ఫిలిప్పిన్స్‌లోని సొర్సోగాన్ రాష్ట్రంలో గల మౌంట్ బులుసాన్ అగ్నిపర్వతం సోమవారం మరోమారు బద్దలైంది. పర్వత శిఖరాగ్రం నుంచి 700 మీటర్ల పైకి అది బూడిదను ఎగజిమ్ముతుండటంతో.. సమీప ప్రాంతాల ప్రజల్ని అధకారులు అప్రమత్తం చేశారు. బులుసాన్ వద్ద గత 24 గంటల్లో 28 అగ్నిపర్వత ప్రకంపనలను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ అగ్నిపర్వతం శనివారం నుంచి బూడిదను ఎగజిమ్ముతోంది. దేశంలో తరచూ బద్దలయ్యే 23 అగ్నిపర్వతాల్లో బులుసాన్ ఒకటి. 2006లో ఇది చివరిసారిగా బద్దలైంది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...