Tuesday, November 9, 2010

మహరాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామా

న్యూఢిల్లి,నవంబర్ 9: కాంగ్రెస్ అధిస్టానవర్గం ఆదేశాల మేరకు మహరాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ శంకర్ నారాయణన్ ఆమోదించారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కెంద్ర మంత్రులు ప్రణబ్, ఆంటోనీల నివేదిక  దరిమిలా పదవి నుంచి వైదొలగవలసిందిగా అశోక్ చవాన్ ను సోనియా గాంధీ ఆదేశించారు. కొత్త సీ.ఎం. ను నియమించేవరకు పదవిలో కొనసాగాలని ఆదేశించారు.కొత్త ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ప్రుధ్వీరాజ్ చవాన్ ల పేర్లు వినవస్తున్నాయి.ఇలావుండగా, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై సి.బి.ఐ. దర్యాప్తుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...